Badrachalam: రామయ్య సంబురాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. అశేష భక్తజనం మధ్య..
రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు. కల్యాణం అనంతరం తలంబ్రాలు పొందేందుకు భక్తులు ఉత్సహం చూపుతారు. వీటిని పొందడానికి ఇలా చేయండి..
కల్యాణ తలంబ్రాలు.. (Badrachalam)
రామయ్య కల్యాణం అనంతరం తలంబ్రాల కోసం భక్తులు ఎదురు చూస్తారు. కల్యాణం అవగానే.. ఆలయం వద్ద కౌంటర్లలో రెండు ముత్యాలు గల ప్యాకెట్‌ను రూ.30 చొప్పున భక్తులకు విక్రయించనున్నారు. ఇక వీటిని ఇంటి వద్దనే పొందాలనుకుంటే.. ఆర్టీసీ కార్గో ద్వారా తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ కార్గో నుంచి రూ.116, పోస్టల్ ద్వారా పొందాలనుకుంటే రూ.150 చెల్లించాలి. కరోనా ప్రభావంతో.. ఎక్కువ మంది కల్యాణానికి హాజరు కావడం లేదు. అలాంటి వారికి మరో అవకాశం ఉంది. వీరింటికే ప్రసాదం, తలంబ్రాలు పంపుతారు.
ఈ ఏడాది 2.50 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను తయారుచేయాలని నిర్ణయించారు. దూర ప్రాంతాల వారికి 1.50లక్షల పొట్లాలు పంపించి 50వేల ప్యాకెట్లను ఇక్కడి కౌంటర్లలో విక్రయిస్తారు. 70 కౌంటర్లలో తలంబ్రాలను గురువారం ఉచితంగా అందించనున్నారు.
ఇక ప్రసాదాల తయారీ ప్రక్రియను ఈవో రమాదేవి పర్యవేక్షిస్తూ నాణ్యతపై దృష్టి సారించారు. 19 చోట్ల లడ్డూ కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నారు.
రామయ్య సంబురాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. అశేష భక్తజనం మధ్య.. రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు. దీంతో భద్రాద్రి రాములోరి గుడిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో కొత్త శోభ సంతరించుకుంది. అలాగే ప్రధాన కూడళ్లతో పాటు మెయిన్ సెంటర్లలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు స్వామివారి వివాహ వేడుక జరగనున్న మిథిలా ప్రాంగణంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు వేయించారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. రాములోరి కల్యాణానికి భద్రాద్రి అంగరంగ వైభంగా ముస్తాబైంది. శ్రీరామ నవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు..
భద్రాచలంలో సీతారాములు వేడుకల ఉత్సవాలు.. ఉగాది నుంచి ప్రారంభం అయ్యాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని మిథిలా మండపంలో గురువారం కల్యాణం జరుపుతారు.
ఇదే వేదికపై పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తారు.
మంగళవారం నుంచి ఏప్రిల్ 5 వరకు నవాహ్నిక తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
అదేస్థాయిలో వీఐపీలు రానున్నారు. ఈనేపథ్యంలో వసతి సమస్య తప్పదని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇబ్బంది లేకున్నా.. నిర్వాహకులు బ్లాక్ చేసుకున్న గదుల అద్దెలను సామాన్యులు భరించలేరు.