Site icon Prime9

Prakash Ambedkar: రెండో రాజధానిగా హైదరాబాద్‌ సరైందని అంబేద్కర్ కోరిక

Prakash Ambedkar

Prakash Ambedkar

Prakash Ambedkar: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మార్పురావాలంటే సంఘర్షణ తప్పదని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పుకోసం అంబేద్కర్ భావజాలం ఎంతో అవసరమని.. ఆయన ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి అని తెలిపారు. ఇందుకోసం సంఘర్షణ తప్పదన్నారు ప్రకాష్ అంబేద్కర్. 1923లోనే రూపాయి సమస్యపై అంబేద్కర్ పరిశోధన పత్రం రాశారని చెప్పారు. భారత్ ను బ్రిటిష్ వాళ్లు ఎలా దోచుకుంటున్నారో ముదే ఆయన గ్రహించారని.. రూపాయి బలోపేతం ఆవశ్యకతను గట్టిగా చెప్పారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.

 

చిన్నరాష్ట్రాల ప్రతిపాదనకు అంబేద్కర్ మద్దతు(Prakash Ambedkar)

తెలంగాణలో ఆర్థిక అసమానతలపై పోరాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళితబంధు లాంటి పథకాలు రూపొందించించిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికి కొన్ని చిన్న కులాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కోసం ఆనాడు పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగం చేశారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసే వరకు ఆ సమస్య పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ కోసం కూడా ఎన్నో ఏళ్ల పాటు ఎంతో పోరాటం జరిగింది. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు కూడా అంబేద్కర్ ఆనాడు మద్దతిచ్చారని గుర్తుచేశారు. దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేడ్కర్‌ చెప్పారన్నారు. రెండో రాజధానిగా హైదరాబాద్‌ సరైందని సూచించారని చెప్పారు. పాక్‌ , చైనా నుంచి హైదరాబాద్‌ ఎంతో దూరంలో ఉందని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ వివరించారు.

ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ(Prakash Ambedkar)

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా.. హెలికాప్టర్‌ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. విగ్రహావిష్కరణకు ముందు బౌద్ధ గురువులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, భారాస కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

 

విగ్రహ విశేషాలివే..

పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉంచారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలానే బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది. ఇంకా ఆ విగ్రహం ప్రత్యేకతలు మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహంగా ఇది పేరుగాంచింది.
ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు.
ఈ విగ్రహం బరువు సుమారు 465 టన్నులు ఉంటుంది. ఇందుకోసం 96 టన్నుల ఇత్తడి వాడారు.
విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు.
ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు. పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది.
11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు.

 

Exit mobile version