Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన శ్రావణ్ కుమార్

Phone tapping case Petition in High Court by Shravan Kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ కుమార్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది. కాగా, ఈయన ఓ మీడియా ఛానెల్ ఎండీగా ఉన్న సంగతి తెలిసిందే.

అంతకుముందు, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నిందితుడిగా శ్రావణ్ కుమార్‌ను చేర్చడంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బెయిల్ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు అధిష్టానం పోలీసులకు నోటీసులు అందజేసింది. అయితే పిటిషనర్‌కు బెయిల్ ఇచ్చేందుకు కింది కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

కాగా, పిటిషనర్ నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉండడంతో ఇటీవల ఆయన పాస్ పోర్టు సైతం రద్దయింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉన్న ఆయన భారత్ రావాల్సి ఉంది. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసేందుకు హైకోర్టు ఆశ్రయించారు. ఇందులో పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానని వెల్లడించారు. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వాలని వేసిన పిటిషన్ వాదనలు విన్న తర్వాత ఈ విచారణను హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.