BRS EX MLA Patnam Narender Reddy: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. చర్లపల్లి జైలులో నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించిన న్యాయస్థానం ఇంటి భోజనానికి అనుమతించింది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి భారీ ఊరట లభించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల అధికారుల దాడి కేసులో ఆయనను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు. అయితే చర్లపల్లి జైలులో ఆయనకు స్పెషల్ బ్యారేక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. ఈ మేరకు ఇంటి భోజనానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పాటు తన రిమాండ్‌ను కొట్టి వేయాలని ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ శ్రీదేవి బెంచ్ విచారించింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ చేసింది. రోస్టర్ పద్ధతిలో మరో బెంచ్‌కు హైకోర్టు బదిలీ చేసింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉండనుంది. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.