New Liquor Brands In Telangana: మద్యం బాబులకు గుడ్ న్యూస్. తెలంగాణలో త్వరలో కొత్త లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ప్రకటనతో 604 రకాల బ్రాండ్లు సరఫరా చేసేందుకు 92 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో ఇండియన్‌కు సంబంధించినవి 331 కొత్త బ్రాండ్లు ఉండగా.. 273 ఫారిన్ బ్రాండ్లు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
కాగా, ప్రస్తుతం 6 కంపెనీలు మాత్రమే లిక్కర్ సరఫరా చేస్తున్నాయి. గుత్తాధిపత్యం లేకుండా కొత్త కంపెనీలు ఎంపిక చేయాలని సర్కాక్ యోచిస్తుంది. ఇందులో భాగంగానే కొత్త బ్రాండ్లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. అలాగే 45 పాత కంపెనీలు.. 218 కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని వివరించింది.
మొత్తం దరఖాస్తులు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. దీంతో రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల అమ్మకాలు జరగనున్నాయని ఎక్పైజ్ శాఖ తెలిపింది. ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేసేందుకు ముమ్మరంగా పనులు కొనసాగుతున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల మందు విక్రయించాలనుకునే కంపెనీల కోసం రాష్ట్ర ఎక్పైజ్ శాఖ ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు తొలుత మార్చి 15వ తేదీని చివరి తేదీగా నిర్ణయించగా.. తర్వాత ఆయా కంపెనీలు గడువు పెంచాలని కోరడంతో ఏప్రిల్ 2వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తులను పరిశీలించి కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వనున్నట్లు ఎక్పైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు.