Prime9

MLC Kavitha Comments on KCR: కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి: ఎమ్మెల్సీ కవిత!

MLC Kavitha Response on Letter Which is Sent to KCR: మా నాయకుడు కేసీఆరేనని, ఆయన నాయకత్వలోనే రాష్ట్రం బాగుపడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

 

వరంగల్‌లో జరిగిన సభ తర్వాత రెండు వారాల క్రితం తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. తన అభిప్రాయాలు లేఖ ద్వారా స్పష్టం చేసినట్లు తెలిపారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దీన్ని వెనుక ఎవరు ఉన్నారో తెలియదని దాటవేశారు. తన కుమారుడు గ్రాడ్యుయేషన్ వేడుక పూర్తి చేసుకొని అమెరికా నుంచి వచ్చే లోపు లేఖ బహిర్గతం అయిందని, దానిపై నానా హంగామా నడుస్తున్నట్లు తెలిసిందన్నారు. కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్ననే తాను చెప్పానన్నారు. తాను అంతర్గతంగా కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం కావడం పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన విషయమన్నారు.

 

పార్టీలో ఉన్న నాయకులు అనుకుంటున్న విషయాలే తాను లేఖలో ప్రస్తావించినట్లు చెప్పారు. గతంలోనూ తన తండ్రికి అంతర్గతంగా లేఖలు రాసినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్నారు. మా నాయకుడు కేసీఆర్.. ఆయన నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకెళ్తుందన్నారు. పార్టీలో చిన్న చిన్న తప్పులను చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుందని ఆమె అన్నారు.

Exit mobile version
Skip to toolbar