Site icon Prime9

MLC Kavitha: వైద్య విద్యార్థిని ప్రీతి తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లెటర్

MLc Kavitha

MLc Kavitha

MlC Kavitha: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి మృతిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రీతి మృతి చెందిన తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు. ప్రీతి మరణంతో ఒక తల్లిగా ఆవేదన చెందానని విచారం వ్యక్తం చేశారు.

నిందితులను వదలబోం: ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)

ఈ మేరకు ప్రీతి తల్లిదండ్రులకు ఆమె లేఖ రాశారు. ‘ఎన్నో కష్టాలు ఓర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నాను. చదువకుని సమాజానికీ సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం.

ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. కడుపు కోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నించినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు రాకూడని పరిస్థితి’ అని కవిత లేఖలో పేర్కొన్నారు.

 

 

‘ మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని మీకు హామీ ఇస్తున్నాం.

ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. యావత్‌ రాష్ట్ర ప్రజలు మీ వెంటే ఉన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని కవిత తెలిపారు.

 

 

Exit mobile version