Prime9

Warangal: చీరకట్టులో మెరిసిన అతివలు.. రామప్పలో అందాల భామలు

Miss World Contestants: మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందడి చేశారు. ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన అందాల భామలు ఇవాళ వరంగల్ విజిట్ చేశారు. వీరికి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చీరకట్టు ఆందరినీ ఆకట్టుకున్నారు. వరంగల్ హరిత హోటల్ లో అందాల భామలు బతుకమ్మలు ఆడి.. ఔరా అనిపించారు.

 

ముందుగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే స్వాగతం పలికారు. అనంతరం 22 మంది సుందరీమణులు వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్ ను సందర్శించారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.

 

ఆ తర్వాత ములుగు జిల్లా రామప్ప ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్, జిల్లా టూరిజం శాఖ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ద్వారా కళాకారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాల్లో నిర్వహించే లేజర్, లైటింగ్ షోలో పాల్గొన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందాల భామల పర్యటనతో భద్రతా బలగాలు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

 

Exit mobile version
Skip to toolbar