Prime9

Miss World 2025 Contest @Hyderabad: నేటి నుంచి హైదరాబాద్ లో అందాల పోటీలు..

Miss World 2025 Contest Starts from Today in Hyderabad:  అందాల పోటీలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచసుందరి పోటీలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడులకను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభంకానుంది.

 

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 50 మందితో తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన, 250 మందితో పేరిణి నృత్యం జరగనుంది.150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం చేశారు. కంటెస్టెంట్లకు విమానాశ్రయం నుంచి హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

 

అందాల పోటీలను వాయిదా వేయండి: ఎమ్మెల్సీ కవిత
పాకిస్తాన్ తో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో అందాల పోటీలను వాయిదా వేయాలని కోరారు బీఆర్ఎస్ లీడర్, ఎమ్మెల్సీ కవిత. ఐపీఎల్ ను వాయిదా వేసినట్లే మిస్ వరల్డ్ పోటీలనే వాయిదా వేయాలన్నారు. ఇది విజ్ఞత ప్రదర్శించే సమయమన్నారు. జాగృతి ఆద్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.

 

Exit mobile version
Skip to toolbar