Site icon Prime9

Srirama Navami 2925 : భద్రాచలం బ్రహ్మోత్సవాలకు రండి.. సీఎం రేవంత్‌‌రెడ్డిని ఆహ్వానించిన మంత్రి

Srirama Navami 2925

Srirama Navami 2925

Srirama Navami 2925 : భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ, భద్రాచలం దేవస్థానం అర్చకులు, అధికారులు ఆహ్వానించారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో స్వయంగా కలిసి రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక అందించారు.

 

 

ఈ సందర్భంగా శ్రీరామనవని బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి ముఖ్యమంత్రి రేవంత్ తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎంను కలిసిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar