Maoists: తెలంగాణలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈ లేఖలు అలజడి రేపాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి సొంత జిల్లాలో లేఖలు విడుదల కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాలో లేఖలు సంచలనం రేపాయి.
తెలంగాణలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈ లేఖలు అలజడి రేపాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి సొంత జిల్లాలో లేఖలు విడుదల కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
మావోయిస్టులు ఒకేసారి 15 మందికి లేఖలు రాయడం రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగింది. శుక్ర, శనివారాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ లేఖలు అందినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలోని 15 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు, ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీవోలు, నర్సింహులపల్లె గ్రామంలోని మరో 12 మందికి మావోయిస్టు గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ పేరిట లేఖలు అందాయి.
ఈ లేఖల్లో పలు విషయాలను ప్రస్తావించారు. అటవీ భూములు ఆక్రమణ.. చెట్లు నరికివేత వాటిని ప్రస్తావించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కోట్లు దండుకుంటున్నారని ఆరోపించింది.
గ్రామాల్లో నిర్వహించాల్సిన పంచాయితీలను పోలీసుస్టేషన్ల దాకా తీసుకెళ్తున్నారని మావోయిస్టు కమిటీ తెలిపింది.
నర్సింహులపల్లెలో అక్రమంగా నిర్మించిన ఓ దుకాణాన్ని కూల్చివేయాలని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడేవారికి ప్రజా కోర్టులో శిక్ష విధించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
అయితే, ఒకేరోజు 15మంది సర్పంచ్‌లు, అధికారులు, గ్రామస్తులకు లేఖలు పోస్టు ద్వారా పంపించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇవి మావోయిస్టులు జారీచేసినవా లేక, కావాలనే కొందరిలా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, బాధితులు ఎస్పీతోపాటు సీఐ, ఎస్సైలను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.
ఈ లేఖల విషయాన్ని ఎస్పీ భాస్కర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఈవిషయంపై బీర్‌పూర్ ఎస్సై అజయ్‌ను వివరణ కోరగా పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని చెప్పారు.