Site icon Prime9

Telangana Inter Students : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నో ఎంట్రన్స్

Telangana Inter Students

Telangana Inter Students

Telangana Inter Students : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ సీట్లను ఎంట్రన్స్ పరీక్ష లేకుండా భర్తీ చేయాలని సొసైటీ నిర్ణయించింది. ప్రతి ఏటా మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. కానీ, ఇక నుంచి ఆ విధానాన్ని రద్దు చేసింది.

 

 

ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రవేశ పరీక్ష లేకుండా అడ్మిషన్లు స్వీకరించనున్నారు. అడ్మిషన్ల కోసం పదో తరగతిలో వచ్చిన మార్కులు, మెరిట్ ఆధారంగా ఇంటర్‌లో ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్ మార్కులు, మెరిట్ ఆధారంగా డిగ్రీలో అడ్మిషన్లు కల్పిస్తారు. త్వరలో డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీ గురుకులాల సొసైటీ పరిధిలోని 261 ఇంటర్, 33 డిగ్రీ కళాశాలల్లో కలిపి 25 వేల సీట్లు ఉన్నాయి.

 

 

 

 

Exit mobile version
Skip to toolbar