6 Minute Wedding : వివాహ వేడుక అంటే బంధువులు, కుటుంబ సభ్యులతో సందడిగా ఉంటుంది. అదిరిపోయే డెకరేషన్, విందు, ఇలా అన్నీ కలగలిపి వివాహ వేడుక జరగడం ఇప్పుడు కామన్ అయ్యింది. కానీ, ఈ వివాహ వేడుక మాత్రం పూర్తి అందుకు భిన్నంగా పూర్తి చేశారు. కేవలం వధూవరులు మాత్రమే వచ్చారు. నిమిషాల్లో పెళ్లి తంతు ముగిసింది.
కొత్త ఒరవడికి శ్రీకారం..
తెలంగాణలో వివాహ వేడుకల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తన కుమారుడి పెళ్లి వేడుకను 6 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. సామాజిక వ్యవస్థలో వివాహం సంస్కృతిపై కొత్త దృక్పథాన్ని తీసుకువచ్చింది. సంప్రదాయాల బదులు, భారీ ఖర్చులు లేకుండా సాదాసీదాగా జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సంప్రదాయ వివాహ వేడుకలు..
భారతీయ సంస్కృతిలో వివాహం అనేది పెద్ద పండుగ. వేద మంత్రాల నడుమ, హల్ది, ముంగి, వివిధ పూజలు, ఆభరణాలు, పెద్ద విందులు, సంగీతం వంటి అనేక సంప్రదాయ పద్ధతులు వివాహ వేడుకలో ఉండటం సాధారణం అయ్యింది. వివాహ వేడుకలు కేవలం కుటుంబ స్టేటస్‌గా పరిగణింపబడుతుంది. వివాహం ఆడంబరాలు చూసి, వారి హోదాను గౌరవించే రోజులు ఇవి. కానీ, పెద్దమొత్తం ఖర్చులతో కూడిన వివాహాలు కుటుంబాలపై ఆర్థిక భారం పెంచుతుందని చెప్పవచ్చు. అప్పులు, మోసాలు, ఆర్థిక ఇబ్బందులు పెళ్లిళ్లు తర్వాత తరచూ కనిపిస్తున్న సమస్యలు. అందుకే సమాజంలో నిరాడంబర, సాదాసీదా వివాహాలపై ఆసక్తి పెరుగుతోంది.
ఆదర్శ వివాహం..
మహబూబాబాద్ జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తన కుమారుడి పెళ్లి వేడుకలను పీఎస్సార్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. పెళ్లి వేడుకలో సాధారణ సంప్రదాయాలను వదిలేశారు. వేద మంత్రాలు, పెద్ద పండుగలు, భారీ విందులు లేకుండా కేవలం ఆరు నిమిషాల్లో పెళ్లి తంతు పూర్తిచేశారు. వివాహ ప్రమాణ పత్రంపై పెద్ద మనుషుల సమక్షంలో సంతకాలు చేసి పెళ్లి ముగించారు. వివాహ సంబురాలు, బంగారు ఆభరణాలు, కట్న కానుకలు, పసుపు తాడు వంటి సంప్రదాయ అంశాలు లేకపోవడం ప్రత్యేకం.
సమాజానికి సంకేతం..
ఈ వేడుక ద్వారా వివాహాలపై ఉన్న అనవసర భారాలు తగ్గించుకోవచ్చని, పెద్ద అద్భుతాలు లేకుండా సాదాసీదాగా వివాహాలు జరగగలవని స్ఫూర్తిని కలిగించింది. సామాజికంగా కొత్తదనం, ఆడంబరాలు లేని వివాహానికి సూచనగా మారిందని అందరూ అంటున్నారు. వివాహ తతంగం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆర్భాటలు లేకుండా తొంతరగా ముగించడం, మించిన ఆర్థిక భారం లేకపోవడం సమాజానికి కొత్త దిశగా మారిందని అంటున్నారు. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని ప్రాంతాల్లో జరగాలని కోరుతున్నారు.