Site icon Prime9

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ గడువు పొడిగింపు.. హైదరాబాద్‌కు రానున్న జస్టిస్ పీసీ ఘోష్

Kaleshwaram Inquiry Commission Deadline Extended: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరోసారి పొడిగించింది. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ వేసింది.

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ గడువును ఏప్రిల్ 30 వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నెల 23 వ తేదీనన జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కొనసాగించనున్నారు. ఈ దఫా మిగిలిన విచారణతోపాటు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. కాగా తదుపరి జరగనున్న విచారణలో అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లలతోపాటు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని కొంతమంది పెద్ద నాయకులను కూడా పిలిచే అవకాశముందని తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar