IPS officers Transferred in Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు మరోసారి జరిగాయి. మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
ఇందులో హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్, సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.