Site icon Prime9

Telangana Govt: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు

Indiramma Houses For Beneficiaries: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్రూ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలోని వారికి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఎల్ 1 సొంత స్థలం ఉన్నా వారు, ఎల్2 స్థలం లేనివారు, ఎల్3 ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నావారుగా విభజించింది. ఎల్1 లో సొంత స్థలం ఉన్న వారు 21.93లక్షల మందిని చేర్చగా.. ఎల్2లో స్థలాలు లేనివారు 19.6 లక్షల మంది ఉన్నారు. ఎల్3లో ఇళ్లు ఉండి కూడా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు.

ఎల్1లో సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు ఇవ్వనుంది. అలాగే ఎల్2లో సొంత స్థలాలు లేని వారి రానున్న ఆర్థిక సంవత్సరంతో పాటు ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామగ్రికి రూ.5 లక్షలు ఇవ్వనుంది. అయితే ఇందులో దాదాపు 80వేలమందికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Exit mobile version
Skip to toolbar