Prime9

Hydra Action: హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కొరడా.. అక్రమ కట్టడాల కూల్చివేత!

Hydra Demolishes Illegal Constructions In Hyderabad: హైదరాబాద్‌లో హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేతలో మళ్లీ వేగం పెంచింది. తాజాగా, మియాపూర్, మణికొండ, హైదర్ నగర్ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేతలు షురూ చేశారు.

 

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం హైదర్‌ నగర్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన కొన్ని షెడ్లను కూల్చివేశారు. కొంతమంది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను అక్రమంగా ఆక్రమించడంతో పాటు షెడ్లను ఏర్పాటు చేశారు. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

అంతేకాకుండా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో పార్కు స్థలం కబ్జా చేసి చేపట్టి నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇందులో తొలుత పార్క్ స్థలం కబ్జాకు గురైందని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా అధికారులు మే 14న డాలర్ హిల్స్ కాలనీలో స్థలాన్ని పరిశీలించారు. ఇవాళ తెల్లవారుజామున భారీ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు.

 

Exit mobile version
Skip to toolbar