TS 10th Exams: పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. తొలి రోజు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ లో చక్కర్లు కొట్టగా.. తాజాగా రెండో రోజు హిందీ పేపర్ వాట్సాప్ లో వైరల్ అయింది. ఇప్పటికే టీఎస్ పీఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. తొలి రోజు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ లో చక్కర్లు కొట్టగా.. తాజాగా రెండో రోజు హిందీ పేపర్ వాట్సాప్ లో వైరల్ అయింది. ఇప్పటికే టీఎస్ పీఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. రెండో రోజు హిందీ పేపర్.. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్ లో వైరల్ అయింది.
ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించలేదు.
ఈ ప్రశ్నపత్రం బయటకు ఎలా వెళ్లిందనే విషయంపై అధికారులు విచారణ ప్రారంభించారు.
వరుసగా రెండో రోజు లీక్ అవ్వడం పట్ల.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు.
ఈ లీక్ అవ్వడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు వరంగల్, హన్మకొండ డీఈవోలతో మంత్రి మట్లాడారు. ఈ ఘటనపై వెంటనే సీపీకి ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించారు.
మంత్రి సూచనతో.. డీఈవోలు సీపీ కి ఫిర్యాదు చేశారు.
లీకైన పేపర్.. నేడు నిర్వహించిన పరీక్షతో సరిపోలిందని డీఈవో వాసంతి అన్నారు. ఈ వ్యవహారంపై సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి బయటకు వెళ్లిందనే విషయం ఇంకా నిర్దారణ కాలేదని తెలిపారు. ఇది ఎవరు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
ఇక మెుదటి రోజు తెలుగు పేపర్ లీకైన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో హిందీ పేపర్ కూడా లీకవడం కలకలం రేపుతోంది.