Power Consumption: విద్యుత్ వినియోగంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. తెలంగాణ చరిత్రలో మంగళవారం (నేడు) ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలల అనుకున్నదాని విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది.
విద్యుత్ వినియోగంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. తెలంగాణ చరిత్రలో మంగళవారం (నేడు) ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలల అనుకున్నదాని విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10.03 నిమిషాలకు 15254 మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదు అయ్యింది. వేసవికాలం ప్రారంభం కావడంతో.. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఓ వైపు సాగు విస్తీర్ణం పెరగడం.. మరోవైపు పారిశ్రామిక అవసరాలు పెరగడంతో కూడా దీనికి ఓ కారణం. ఈ కారణల వల్ల.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు.
రాష్ట్రం మెుత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం విద్యుత్ వ్యవసాయ రంగానికే వినియోగింపబడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా.. రెండో స్థానంలో తెలంగాణ ఉంది. నిన్న 14 138 మెగా వాట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15254 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు ఇదే.
గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్‌ను అధిగమించి ఈ నెలలోనే 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15254 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.
ఎంత డిమాండ్ వచ్చిన సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ప్రభాకర్‌రావు తెలిపారు. మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ముందే ఉహించాం. అందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర రైతాంగంకు,అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎండీ అన్నారు.