Prime9

Rain Alert: రానున్న 4రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

Breaking News: రానున్న 4రోజులు  భారీ వర్షాలు

 

Rain Alert: గత కొన్ని రోజులుగా వర్షాలు ఊహించకుండా పడుతున్నాయి. ఎప్పుడు పడుతున్నాయో ఎప్పుడు వెలుస్తున్నాయో తెలియడం లేదు. అయితే వాతావరణ శాఖ తాజాగా వర్షపాతంపై రిపోర్ట్ ను విడుదల చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది.

 

రాబోయే నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే21 వరకు వర్షపాతం ఉంటుందని హెచ్చరిక జారీ చేసింది. దీంతో తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలకు అల్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో కూడా వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అధిక వర్షాలు ఉండటం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Exit mobile version
Skip to toolbar