Health Director: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పలు వ్యాఖ్యలు చేసి మీడియా దృష్టిలో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఓ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన.. డాక్టర్లు చేయలేని పని.. తాయత్తు చేసిందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వివాదాస్పద వ్యాఖ్యలు.. (Health Director)
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పలు వ్యాఖ్యలు చేసి మీడియా దృష్టిలో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఓ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన.. డాక్టర్లు చేయలేని పని.. తాయత్తు చేసిందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాయత్తు మహిమతోనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని తెలిపారు.
ఈ మేరకు తాయత్తు ప్రాముఖ్యతను తెలిపే క్రమంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శ్రీనివాస రావుకి కొత్త కాదు.
ఓ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
మరో విశేషం ఏంటంటే.. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన డాన్స్ వేసి వార్తల్లో నిలిచారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు.
దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పు లేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది.
శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తున్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.