Site icon Prime9

ED officers’ searches : సురానా ఇండస్ట్రీస్‌ ఎండీ నరేంద్ర ఇంట్లో రెండోరోజూ ఈడీ సోదాలు

ED officers' searches

ED officers' searches

ED officers’ searches : హైదరాబాద్‌లో గురువారం రెండోరోజూ కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సురానా ఇండస్ట్రీస్‌ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సురానా ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ సాయి సూర్య డెవలపర్స్‌ డైరెక్టర్ల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నరేంద్ర సురానాతోపాటు సాయి సూర్య డైవలపర్స్‌ సతీశ్‌ ఇంట్లో పెద్దమొత్తం నగదు పట్టుబడినట్లు తెలుస్తున్నది.

 

పలు షెల్‌ కంపెనీలు ఏర్పాటు..
సురానా ఇండస్ట్రీస్‌ ఎండీ పలు షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి పొందిన రుణాలు పొందారు. వీటి ద్వారా అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో తేలింది. నిధుల మళ్లీంతోపాటు పెద్ద మొత్తంలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరుపుతున్నది.

 

రూ.3,986 కోట్లు ఎగ్గొట్టిన సురానా గ్రూప్‌..
సురానా గ్రూప్‌ 3 బ్యాంకులకు రూ.3,986 కోట్లు ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఈడీ సోదాలు నిర్వహించింది. రూ.11.62 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar