Site icon Prime9

Dr. BR Ambedkar: ఆకాశమంత స్ఫూర్తి.. విగ్రహం విశేషాలివే

statue

statue

Dr. BR Ambedkar: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకొని నేడు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ సమీపాన ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది కావడం విశేషం.

విశేషాలివే.. (Dr. BR Ambedkar)

పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉంచారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలానే బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది. ఇంకా ఆ విగ్రహం ప్రత్యేకతలు మీకోసం ప్రత్యేకంగా..

2016 ఏప్రిల్ 14న 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ విగ్రహం అంబేడ్కర్ 132వ జయంతి నాడు ఆవిష్కారం కాబోతోంది.

దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహంగా ఇది పేరుగాంచింది.
ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు.
ఈ విగ్రహం బరువు సుమారు 465 టన్నులు ఉంటుంది. ఇందుకోసం 96 టన్నుల ఇత్తడి వాడారు.
విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు.
ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు. పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది.
11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రాజెక్టు స్థలంలో విగ్రహమే కాకుండా, పీఠం కింద ఒక లైబ్రరీ, మ్యూజియం, జ్ఙాన మందిరం, అంబేడ్కర్ జీవిత ముఖ్య ఘట్టాల ఫోటో గ్యాలరీ ఉంటాయి.

విగ్రహం దిల్లీలో తయారు చేసి విడి భాగాలుగా తెచ్చి హైదరాబాద్ లో అమర్చారు.
కార్యక్రమ ముఖ్య అతిథిగా అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ వస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar