Site icon Prime9

Desecration in Temple: హైదరాబాద్ హనుమాన్ టెంపుల్‌లో అపచారం.. శివ లింగం పక్కన మాంసం ముద్దలు కలకలం!

Desecration in Hyderabad Hanuman Temple: హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలోని టప్పాచబుత్ర హనుమాన్ టెంపుల్‌లో అపచారం జరిగింది. హనుమాన్ ఆలయంలో కొంతమంది దుండగులు శివ లింగం వెనుక మాంసం పడేశారు. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు అక్కడ పడిఉన్న మాంసం చూసి కంగుతిన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం వివరాలు సేకరిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాంసం పడేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. హైదరాబాద్‌లో కొంతమంది కావాలనే రెండు వర్గాలకు ఘర్షణ జరగాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు టప్పాచబుత్రా ప్రాంతంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Exit mobile version
Skip to toolbar