Delhi Police: ఎమ్మెల్సీ కవితకు ట్విస్ట్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దీక్ష ఏర్పాట్లలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

Delhi Police: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దీక్ష ఏర్పాట్లలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

అయితే ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరో చోటకు దీక్షను మార్చుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఆఖరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో కవితను ఇరకాటంలోకి నెట్టేసి నట్టైంది. దీక్షకు అనుమతి లభిస్తుందని భావించిన కవిత.. ఇప్పటికే జంతర్‌మంతర్ దగ్గర దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి పోలీసులు దీక్షకు పర్మిషన్ లేదని ప్రకటించారు.

కాగా, జంతర్‌ మంతర్ దగ్గర ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కవిత మండిపడ్డారు.

ముందు అనుమతి ఇచ్చి, ఆఖరి నిమిషంలో దీక్ష స్థలాన్ని ఎలా మార్చుకోమంటారని ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

అనుకున్న సమయానికే ధర్నా: కవిత(Delhi Police)

ముందుగా అనుకున్న సమయానికే ధర్నా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్టు కవిత చెప్పారు.

ధర్నా జరిగే ప్రాంతంలో కొంత భాగాన్ని ఇతరులకు ఇవ్వకుండా మొత్తం జాగృతి సంస్థకు కేటాయించాలని కోరామన్నారు.

జంతర్ మంతర్ వద్ద సగం స్థలం వాడుకోవాలని పోలీసులు సూచించారని తెలిపారు.

అయితే, తాము 5 వేల మంది ధర్నాకు హాజరవుతారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

తమ ధర్నా ప్రాంతంలో.. ఇతరులు కూడా ధర్నా చేస్తున్నారని తమకు తెలియదని కవిత వ్యాఖ్యానించారు.

అకస్మాత్తుగా ఇతరులు వేరే అంశంపై ధర్నాకు దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు( చెప్పారని పోలీసులు తెలిపారు.

కాగా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కవిత కలవనున్నారు.

రేపటి మహిళా రిజర్వేషన్ ధర్నాకు ఏచూరిని ఆహ్వానించనున్నారు.

మరోవైపు, ఢిల్లీ జంతర్ మంతర్ లో రేపు ధర్నా జరిగే స్థలం విషయంలో పోలీసులు, భారత జాగృతి నేతల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది

 

సంఘీభావ సభగా మార్చేందుకు ప్రయత్నాలు?

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కవిత దీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి కవిత ఢిల్లీ చేరుకున్నారు.

మహిళా రిజర్వేషన్ల కోసం కవితన చేపట్టిన దీక్షను… లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ నోటీసులు అందుకున్న కవితకు సంఘీభావ సభగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ దీక్ష వేదిక మారినా.. కవితను బీజేపీ టార్గెట్ చేశారనే ఉద్దేశాన్ని ఢిల్లీ వేదికగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.