Site icon Prime9

Kapilavai Dileep Kumar: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా!

Kapilavai Dileep kumar

Kapilavai Dileep kumar

Kapilavai Dileep Kumar Resigns to Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో పార్టీలో చేశాడు. పార్టీలో చేరిన దిలీప్ కుమార్‌ను రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జిగా అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దిలీప్ కుమార్ బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీగా పని చేశారు. కొద్దిరోజుల తర్వాత కేసీఆర్‌తో విభేదాల కారణంగా పార్టీని వీడారు. అనంతరం పలు రాజకీయ పార్టీల్లో చేరారు. టీజేఎస్, బీజేపీతోపాటు 2014లో రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలో చేరి పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినా కొంతకాలంగా పార్టీలో ఆయనకు పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని దిలీప్ కుమార్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. తాజాగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తాను గతంలో పనిచేసిన ఆర్ఎల్డీలో చేరారు.

 

 

 

Exit mobile version
Skip to toolbar