Site icon Prime9

CM Revanth Reddy: రాజన్న సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. రూ.127 కోట్లతో అభివృద్ధి పనులు

CM Revanth Reddy Visits Vemulawada Temple: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేముల‌వాడ‌కు చేరుకున్నారు. ఈ మేరకు వేములవాడ రాజన్న సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా రూ.127.65కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం రూ.45 కోట్లతో మూలవాగు బ్రిడ్జి నుంచి రోడ్డు విస్తరణ పనులు, రూ.166 కోట్లతో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం, రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులు, రూ.52 కోట్లతో కోనరావుపేటలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులతోపాటు మిడ్ మానేరు నిర్వాసితులకు రూ.235 కోట్లతో ఇళ్ల నిర్మాణానికి వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేశారు.

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో వేములవాడలోని గుడి చెరువు మైదానం వద్దకు చేరుకొని అక్కడినుంచి ఆలయానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రాజరాజేశ్వరస్వామిని దర్శనాంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ సభలో గల్ఫ్ మృతుల బాధితులకు పరిహారం చెక్కులు అందజేయనున్నారు. ఇక్కడినుంచి నేరుగా అతిథి గృహానికి చేరుకొని అక్కడే భోజనం్ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.

ఇదిలా ఉండగా, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారి వచ్చారు. దీంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా వేములవాడ రాజన్న సన్నిధికి అధిక మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ ఆలయం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు వచ్చింది. అయితే గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఇందులో భాగంగానే రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 127 కోట్లు మంజూరు చేసింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Exit mobile version