Site icon Prime9

Revanth Reddy: త్వరలోనే సినిమా చూపిస్తా.. మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Padayatra in Musi Area: సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. యాదాద్రి జిల్లా పలిగొండ మండలం సంగెం గ్రామంలో సీఎం పాదయాత్రను ప్రారంభించారు.ఇందులో భాగంగానే సంగెం టూ భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కెనాల్, నాగిరెడ్డిపల్లి వరకు  దాదాపు 2.5 కిలోమీటర్ల మేర సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా సంగెం గ్రామంలోని మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగం వద్ద సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరిగి పాదయాత్ర కొనసాగించారు.

అన్ని కలుషితం..
మూసీ ఒకప్పుడు జీవనదిగా ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో నీళ్లు, కూరగాయలు, పాలు అన్నీ కలుషితం కావడంతో మూసీ నీటితో పండించిన పంటలకు ధర లభించడం లేదన్నారు. అలాగే మూసీ నదిలో చేపలు బతకడం లేదని, ఇక్కడ పెంచిన గొర్రెలను సైతం కొనేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు.

ట్రైలర్ మాత్రమే..
బీఆర్ఎస్ నాయకులకు ఇఫ్పటివరకు ట్రైలర్ మాత్రమే చూపించామని, త్వరలోనే సినిమా చూపించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. హరీశ్, కేటీఆర్ దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ డిజైన్లు ఖరారవుతాయని పేర్కొన్నారు.

యాదాద్రి పేరు మార్పు..
యాదాద్రి పేరు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్‌ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టెంపుల్ బోర్డు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలు, విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు.

Exit mobile version