Site icon Prime9

CM Revanth Reddy : దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరం : సీఎం రేవంత్

CM Revanth Reddy

CM Revanth Reddy : దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌ కోఠిలో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం వల్ల రాష్ట్రానికి గొప్ప కీర్తి లభిస్తోందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో ఐలమ్మ యూనివర్సిటీ పోటీపడాలని విద్యార్థులు, ప్రొఫెసర్లకు పిలుపునిచ్చారు. అన్నిరంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలలను నిజం చేయాలన్నారు.

ఐలమ్మ యూనివర్సిటీలో చదువుకోవడం విద్యార్థుల అదృష్టం..
ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేష్లను కల్పించే అవకాశం వస్తుందని, అందులో విద్యార్థుల ప్రతినిధ్యం ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా మహిళలకు అవకాశం వస్తే, తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారని, తద్వారా దేశానికే అదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదువుకోవడం విద్యార్థుల అదృష్టమన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు అన్నగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించామని సీఎం గుర్తుచేశారు.

మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహం..
ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదని, వారిలో వ్యాపారవేత్తలుగా రాణించే సత్తా ఉందని సీఎం చెప్పారు. మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని హామీనిచ్చారు. అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడేలా కార్యాచరణ తీసుకుంటున్నామన్నారు. రెండున్నరేళ్లలో ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో నిర్మాణాలు పూర్తి కావాలని, ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశానని స్పష్టం చేశారు. యూనివర్సిటీ నిర్మాణంలో నిధులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తదేనని, చదువుల్లో రాణించి తెలంగాణకు, దేశానికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.

Exit mobile version
Skip to toolbar