Prime9

Revanth Reddy : ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్‌తో సీఎం రేవంత్ భేటీ.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ

Telangana CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో సీఎం భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై వారితో చర్చించారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

 

మరోవైపు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. సభల తేదీలను ఫిక్స్ చేయాలని, సభలకు హాజరుకావాలని మల్లికార్జున ఖర్గే, రాహుల్‌‌ను రేవంత్‌‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి వారు దిశానిర్దేశం చేశారు. 11 ఏళ్ల ప్రధాని మోదీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Exit mobile version
Skip to toolbar