CM Revanth Reddy : టీడీఆర్ పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ టీమ్ సన్నద్ధం అవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మట్లాడారు. నగరంలో ఉన్న టీడీఆర్ షేర్లను కొంతమంది రేవంత్‌రెడ్డి అనుచరులు కొంటున్నారని ఆరోపించారు. త్వరలోనే ఎఫ్ఎస్‌ఐ అమలు చేసి టీడీఆర్‌ను అడ్డగోలు ధరకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అసెంబ్లీ జరుగుతుండగానే ఈ-కార్ రేసింగ్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని భావిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. అదొక లొట్టపీసు కేసు అని, దాని గురించి భయపడనని స్పష్టం చేశారు.
క్రిమినల్స్ కేసులకు భయపడరు..
ఈ క్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని, కేసులకు భయపడితే క్రైం చేయరని కామెంట్ చేశారు. అందుకే కేటీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు మెట్రోను తానే తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తీసుకు వస్తే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తామన్నారు.
తెలంగాణపై కేంద్రం చిన్నచూపు..
తెలంగాణ అభివృద్ధికి అఖిలపక్ష భేటీ నిర్వహించామని, బీజేపీ ఎంపీలు రాలేదని సీఎం దుయ్యబట్టారు. నగరానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వస్తే ఈటల వచ్చారని, కానీ కిషన్‌రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అఖిల పక్షంపై ఆలస్యంగా సమాచారం ఇచ్చారనే అనుకుందామని, మరి ఖట్టర్ కూడా సడెన్‌గా వచ్చారా అని సెటైర్లు వేశారు. రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదని ఫైర్ అయ్యారు. గుజరాత్‌కు బుల్లెట్ రైలు ఇచ్చారని, రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం కడుతున్న పన్నులు ఎంత.. తిరిగి కేంద్ర తమకు కేటాయిస్తున్న నిధులపై తాను చర్చకు సిద్ధమని రేవంత్ కేంద్రానికి సవాల్ విసిరారు.