Caste Census Survey Report To Be Submitted Today: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన కులగణన సర్వే నివేధికను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానీయ బ్రందం రాష్ట్ర కేమినేట్ సబ్ కమిటీకి అందజేయనున్నారు. సచివాలయంలోని కేబినెట్ సభ్ కమిటీ చైర్మన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కమిటీ కో ఛైర్మన్ దామోదర్ రాజు నరసింహ, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వారికి సందీప్ సుల్తానియా కులగణన నివేదికను అందజేయనున్నారు.
ఈ నివేదికపై కేబినెట్ సబ్ కమించి చర్చించిన అనంతరం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 5న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర కేబినేట్ ఆమోదించిన పిదప అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ కులగణన నివేదికను ప్రవేశ పెట్టనున్నారు. ప్రత్యేక చర్చ అనంతరం అసెంబ్లీ ఈ నివేదికపై ఆమోదం తెలపునుంది. కాగా కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ గత ఏడాది అక్టోబర్ 19న ప్రభుత్వం ఉత్తర్వుల ఇచ్చిన సంగతి తెలిసిందే.
తెలంగాణ చేపట్టిన కులగణనపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కేబినెట్‌లో, శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై తేల్చడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. కులగణన నివేదిక రెడీ అయిందని తెలియగానే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అందించే కులగణన నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్లో ఆయనతోపాటు కో -చైర్మన్ అయిన మంత్రి దామోదర రాజా నర్సింహ, ఇతర మంత్రి వర్గ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి హాజరై ఆది, సోమవారాల్లో చర్చిస్తారు.