Site icon Prime9

Gaddam Prasad Kumar : మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. ఎందుకంటే?

Gaddam Prasad Kumar

Gaddam Prasad Kumar : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించేదిగా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి.

 

 

ఈ క్రమంలో ఇవాళ మంత్రి కోమటిరెడ్డి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నపై సమాధానం ఇచ్చే సందర్భంలో బీఆర్ఎస్ హయాంలో సీఆర్ఎస్ నిధులు రాలేదని, నల్లగొండ నియోజకవర్గ రోడ్లకు నిధులు కేటాయించలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఎస్క్రో అకౌంట్ తెరవలేదని చెప్పి, సభను సభ్యులను తప్పుదోవ పట్టించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సీఆర్ఎఫ్ నిధులు వచ్చాయని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ఎస్క్రో అకౌంట్ తెరవడం జరిగిందని, నల్లగొండ నియోజకవర్గంలో రోడ్లకు పెద్దఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

 

 

మూడు అంశాలకు సంబంధించిన ఆధారాలు లేఖ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఇదిలావుండగా, మంత్రి కోమటిరెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన సమాధానం పూర్తిగా అవాస్తవమన్నారు. ఉద్దేశపూర్వకంగా సభకు తప్పుడు సమాచారం ఇచ్చి, సభా గౌరవాన్ని తగ్గించడమే గాక సభ్యుల హక్కులను భంగం కలిగించారని తెలిపారు. దీనిపై శాసన నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ శాసన సభాపక్షం తరఫున మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

Exit mobile version
Skip to toolbar