Road Accident at Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం బైపాస్ రోడ్ లో బొలెరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 36 మేకలు మృతిచెందాయి. కాగా షాద్ నగర్ వద్ద మేకలను తీసుకెళ్తున్న బొలెరో వాహనాన్ని హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొంది. అయితే ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ నిద్రమత్తేనని సమాచారం.
కాగా ప్రమాదంలో 36 మేకలు చనిపోయాయి. బొలెరో డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి. కాగా బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో అదుపుతప్పిన బస్సు బొలెరోను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో మేకలు చనిపోవడంతో యజమాని తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు.