Prime9

KTR : కేటీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి ఏసీబీ నోటీసులు

ACB notices to BRS working president KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 16న ఉదయం 10:00 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఒకసారి ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విచారించారు.

 

మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. మూడు నెలలు గడుస్తున్నా ఎలాంటి విచారణ జరగలేదు. ముగ్గురినీ ఒకేసారి విచారిస్తారని ప్రచారం జరిగినా అంశంపై అసలు స్పష్టతే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నెలలు గడుస్తున్నా విచారణలో మాత్రం పురోగతి కనిపించడం లేదంటూ ఇటీవల పలు మీడియా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు.

Exit mobile version
Skip to toolbar