Site icon Prime9

High Court : రేవంత్‌రెడ్డి సర్కారుకు బిగ్‌ షాక్.. గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్

High Court

High Court

High Court : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై హెచ్‌సీయూ, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. దీంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ 400 ఎకరాల భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇప్పటికే 400 ఎకరాల భూమలు తమవంటే తమవి అంటూ ప్రభుత్వం, హెచ్‌సీయూ పరస్పర వాదనకు దిగాయి. భూములను వేలం వేసేందుకు చదును చేసేందుకు జేసీబీలతో ప్రయత్నించగా, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విపక్ష నేతలు విద్యార్థుల పోరాటానికి మద్దతుగా సర్కారుపై మాటల తూటాలు పేల్చుతున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కంచె గచ్చిబౌలి భూముల వివాదం చర్చనీయాంశంగా మారింది.

 

 

సుప్రీం కోర్టులో తీర్పు.. 
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2004లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐఎంజీ అనే కంపెనీని కట్టబెట్టింది. ఈ క్రమంలో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఐఎంజీ కంపెనీకి సామర్థ్యం లేదని, అది ఒక బోగస్ కంపెనీ అని కంచ గచ్చిబౌలి భూముల కేటాయింపును రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, ప్రభుత్వ ఉత్తర్వలను సవాల్ చేస్తూ ఐఎంజీ కంపెనీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా, 21 ఏళ్ల సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత ఆ భూములు ప్రభుత్వానంటూ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే ఆ 400 ఎకరాల భూములను తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు విక్రయించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఆ భూములపై వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

Exit mobile version
Skip to toolbar