Site icon Prime9

Telangana: పంచాయతీరాజ్ సవరణ బిల్లకు ఏకగ్రీవం.. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు : మంత్రి సీతక్క

Telangana Council

Telangana Council

Telangana Council : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును ఏకగ్రీవంగా శాసనమండలి ఆమోదించింది. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. బిల్లుపై సభ్యులు విలువైన సూచనలు చేశారని, బిల్లులో లేని అంశాలను ప్రస్తావించారని తెలిపారు. సభ్యులు ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తించారని పేర్కొన్నారు. చట్టాన్ని 1/70 గా పిలుస్తారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు, అభివృద్ధి జరిగేందుకు 1/70 చట్టం కృషి చేస్తుందని మంత్రి సీతక్క వెల్లడించారు.

 

 

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు..
రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు ఏజెన్సీ గ్రామాలను గుర్తించినట్లు చెప్పారు. చట్టం అమలులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. తమకు మున్సిపాలిటీ కావాలని ఎన్నో గ్రామల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. ములుగు జిల్లా కేంద్రం అయినా మున్సిపాలిటీ చేయలేదన్నారు. ఇప్పుడు మనం ములుగును మున్సిపాలిటీగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం, కలెక్టర్లు పంపిన ప్రతిపాదనల ఆధారంగా మున్సిపాలిటీలుగా చేస్తున్నామన్నారు. చాలా మండలాల్లోని గ్రామాలను ఇతర జిల్లాల్లో కలిపారని, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నో గందరగోళాలు తలెత్తుతున్నాయన్నారు.

 

 

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని డిమాండ్..
కొన్ని పల్లెలు ఒక మండల పీఎస్ పరిధిలో ఉంటున్నాయని, రెవెన్యూ పరిధి మరో మండలంలో ఉంటుందన్నారు. సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని డిమాండ్ ఉందని, కేబినెట్, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని తెలిపారు. కొత్త పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని కొందరు సభ్యులు ప్రస్తావించారని, వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించుకున్నామని, కేంద్రం బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని చెప్పారు. అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.

Exit mobile version
Skip to toolbar