Site icon Prime9

Ts Secretariat: కొత్త సచివాలయానికి పటిష్ఠ భద్రత.. బార్‌కోడ్‌ పాస్‌ అనుమతిస్తేనే లోపలికి

secretariat

secretariat

Ts Secretariat: రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ నెల 30వ తేదీన కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం భద్రతను ప్రత్యేక భద్రతాదళం పర్యవేక్షిస్తుండగా.. ఇకపై రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ చేతుల్లోకి రాబోతోంది. దీంతో పాటు సచివాలయంలో నిరంతర పర్యవేక్షణ కోసం 300 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

కొత్త సచివాలయానికి పటిష్ఠ భద్రత (Ts Secretariat)

రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ నెల 30వ తేదీన కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం భద్రతను ప్రత్యేక భద్రతాదళం పర్యవేక్షిస్తుండగా.. ఇకపై రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ చేతుల్లోకి రాబోతోంది. దీంతో పాటు సచివాలయంలో నిరంతర పర్యవేక్షణ కోసం 300 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

సచివాలయానికి ప్రస్తుతం.. 100 మంది ఎస్‌పీఎఫ్‌ సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. ఇక నుంచి 650 మందికి పైగా పహారా కాయనున్నారు.

ఉన్నతస్థాయి సమీక్షల తర్వాత.. సచివాలయ భద్రత బాధ్యతలను టీఎస్‌ఎస్‌పీ చేతికి అప్పగించారు. 350 మందికి పైగా టీఎస్‌ఎస్‌పీ సిబ్బందితోపాటు దాదాపు 300 మంది సాయుధ రిజర్వు పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాల రాకపోకల నియంత్రణకు 22 మంది ట్రాఫిక్‌ పోలీసులను కేటాయించారు. ఎంపిక చేసిన సిబ్బందికి.. శిక్షణ సైతం ఇచ్చారు.

బార్‌కోడ్‌ పాస్‌..

ఇక నుంచి సచివాలయానికి ఎవరు పడితే వారు వెళ్లడానికి వీలులేదు. ముందస్తు పాస్ ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు.

సచివాలయంలో ఏ బ్లాక్‌ను సందర్శించాలో అక్కడికి మాత్రమే వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. బార్ కోడ్ తో నిర్దేశిత బ్లాకుకు మాత్రమే వెళ్లే అవకాశం కల్పించారు.

దీంతో ఇతర బ్లాకులకు వెళ్లడానికి వీలులేదు.

అనుక్షణం కెమెరాల పర్యవేక్షణ

సచివాలయానికి నాలుగువైపులా ఏర్పాటు చేసిన సెంట్రీ పోస్టుల్లో నిరంతరం సాయుధ సిబ్బంది పహారా కాస్తారు. ప్రవేశమార్గాల్లోని మరో రెండు సెంట్రీ పోస్టుల్లోనూ పహారా ఉంటుంది.

వీరితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రధాన ప్రవేశద్వారం వంటి కీలక ప్రాంతాల్లో కాపలా సిబ్బందికి అధునాతన ఆయుధాలు సమకూర్చనున్నారు.

అగ్ని ప్రమాదాల నివారణకు.. రెండు వాహనాలను సిద్ధం చేశారు.

Exit mobile version