Thirupathi: శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తిరుమలలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందంటూ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయి. 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారు. ప్రస్తుతం తిరుమలలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందంటూ రమణదీక్షితులు ట్వీట్ చేశారు.
గతంలో కూడా టీటీడీపై రమణదీక్షితులు పలు ఘాటైన విమర్శలు చేశారు. బ్రాహ్మణ వ్యతిరేక శక్తులున్నాయని వారు ఆలయ విధానాలతో పాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలని ఆయన ట్వీట్ చేసి సీఎం జగన్కు ట్యాగ్ చేశారు. గతంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులుతో పాటూ మరికొందరు రిటైర్ అయ్యారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయగా.. 2018 డిసెంబర్‌లో రిటైర్డ్ నిబంధనను వర్తింపచేయొద్దని కోర్టు ఆదేశించింది.
ఆ తర్వాత అర్చకులు అందరూ ఇవే ఆదేశాలను తమకు అమలు చేయాలని కోరారు. ఆ తర్వాత వైఎస్ జగన్‌ను రమణదీక్షితులు కలిసి సమస్యను వివరించగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అప్పుడు రమణ దీక్షితుల్ని గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారు.