Site icon Prime9

Minors Rescued: ఖాజీపేట రైల్వేస్టేషన్‌లో 34 మంది మైనర్లను రక్షించిన అధికారులు

Minors Rescued

Minors Rescued

Minors Rescued: ఖాజీపేట రైల్వేస్టేషన్‌లో తనిఖీల్లో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మైనర్లను అధికారులు గుర్తించారు. మొత్తం 34 మంది మైనర్ పిల్లలను అధికారులు రక్షించారు. ఆర్పీఎఫ్‌, శిశు సంక్షేమశాఖ అధికారులు గురువారం సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాయి. వీరితో పనిచేయించడానికి బీహార్ నుంచి సికింద్రాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానిక శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరితో పాటు నలుగురు బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు.

పరిశ్రమల్లో పనిచేయించేందుకు..(Minors Rescued)

వివిధ పరిశ్రమల్లో పని చేసేందుకు తరలిస్తున్న ఈ చిన్నారులను గుర్తించి శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చంద్రరావు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ నుంచి కాజీపేట మీదుగా న్యూఢిల్లీ వెళ్లే రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న పిల్లలను గుర్తించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వివిధ శాఖల సమన్వయంతో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, సమావేశ నిర్ణయాల మేరకు బుధవారం దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో 34 మంది బాలకార్మికులను గుర్తించారు.

ఈ సందర్బంగా అనిల్ చంద్రరావు మాట్లాడుతూ పిల్లల వివరాలను గుర్తించి సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి అప్పగిస్తామని తెలిపారు. అప్పటి వరకు బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక శిశు సంక్షేమ కేంద్రానికి తరలించి తాత్కాలిక వసతి కల్పించారు.

Exit mobile version