Site icon Prime9

JC Prabhakar Reddy : భిక్షాటనకు రెడీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి .. అడ్డుకున్న పోలీసులు

JC Prabhakar Reddy

JC Prabhakar Reddy

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటనకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో తన నివాసం వద్దే బుధవారంనాడు జేసీ ప్రభాకర్ రెడ్డి బైఠాయించి నిరసనకు దిగారు.

మున్సిపల్ చెత్త తరలింపు వాహనాల రిపేరికి ప్రభుత్వ నిధులు లేకపోవడంతో నిధుల కోసం భిక్షాటన చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే తాడిపత్రిలో భిక్షాటనకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్తే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసనకు అనుమతి లేదని పోలీసుల జేసీ ప్రభాకర్ రెడ్డిని నిలువరించారు. దీనితో అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. మున్సిపల్ వాహనాలకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రెండు రోజుల్లో నిధులు సమకూర్చకపోతే తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద గాంధీ తరహలోనే తాను నిరసనకు దిగుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. తాడిపత్రి ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారన్నారు. కానీ తాడిపత్రిని అభివృద్ది కోసం తాము పనిచేస్తుంటే నిధులివ్వకుండా ప్రభుత్వం మొండిచేయి చూపుతోందని ఆయన విమర్శించారు.

Exit mobile version