Srikalahasti CI Manju Yadav: శ్రీకాళహస్తి సిఐ మంజు యాదవ్ కు మానవహక్కుల సంఘం నోటీసులు

శ్రీకాళహస్తి ఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం సీరియస్ అయ్యింది. జనసేన నాయకుడిపై సిఐ అంజూయాదవ్ చేయి చేసుకున్న ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కధనాలను.. సుమోటోగా తీసుకుని హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు నమోదు చేసింది. ఈనెల 27లోగా వివరణ ఇవ్వాలని సిఐ అంజూయాదవ్.. డిఎస్పీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 04:51 PM IST

Srikalahasti CI Manju Yadav: శ్రీకాళహస్తి ఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం సీరియస్ అయ్యింది. జనసేన నాయకుడిపై సిఐ అంజూయాదవ్ చేయి చేసుకున్న ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కధనాలను సుమోటోగా తీసుకుని హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు నమోదు చేసింది. ఈనెల 27లోగా వివరణ ఇవ్వాలని సిఐ అంజూయాదవ్.. డిఎస్పీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.

తిరుపతి ఎస్పీని కలవనున్న జనసేనాని..(Srikalahasti CI Manju Yadav)

జనసేనాని పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలో ఎస్పీని కలిసి వినతిపత్రాన్ని పవన్ సమర్పించనున్నారు. అటు నుంచి శ్రీకాళహస్తికి కూడా వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. శ్రీకాళహస్తిలో జనసేన నేతలు ధర్నా చేస్తుండగా సిఐ అంజూ యాదవ్ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. జనసేన నేత స్వామిపై చేయి చేసుకున్నారు. రెండు చెంపలపై కొట్టారు. ఈ విషయాన్నిసేనాని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు. శ్రీకాళహస్తికి వచ్చి అక్కడే విషయం తేల్చుకుంటానని సవాల్ చేశారు.