AP DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే వెలువడ్డాయని, ఆలస్యం చేయకుండా విధుల్లో చేరాలని ఆదేశించారు. దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం 5 గంటలలోపు ఈసీకి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
ముగ్గురు పేర్లను పంపగా..(AP DGP)
ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం కేవీ రాజేంద్రనాథ్‌ను బదిలీ చేయడంతో కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్‌టీసీ ఎండీ), మాదిరెడ్డి ప్రతాప్, హరీష్‌కుమార్ గుప్తాలతో సహా ముగ్గురి పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీ పరిశీలనకు పంపింది. సిఫార్సులను సమీక్షించిన తర్వాత, హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికలసంఘం ఎంపిక చేసింది.