Site icon Prime9

Rushikonda : రుషికొండ అరగుండుకు గ్రీన్ మ్యాట్ విగ్గు..

Rushikonda

Rushikonda

Rushikonda : విశాఖలో సగం తవ్విన రుషికొండపై గ్రీన్‌మ్యాట్‌ కప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది.

రుషికొండపై తవ్వకాలు జరిగినట్టు కనిపించకుండా గ్రీనరీ కనిపించేందుకు

ఇలా చేశారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

గత కొంతకాలంగా రుషికొండ వార్తల్లో కెక్కింది.

రుషికొండలో వైసీపీ సర్కార్ తవ్వకాలు..

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక

ఇక్కడ ఉన్న పర్యాటక శాఖ కాటేజీలను కూల్చేసి

కొత్త భవనాలను నిర్మించాలని భావించింది.

ఈ మేరకు యంత్రాలనుపయోగించి పెద్ద ఎత్తున తవ్వకాలు ప్రారంభించారు.

రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్లు..

భవనాలు ,చెట్లను నేలమట్టం చేసారు.

దీనిపై ఏపీలోని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసాయి.

పలువురు దీనిపై కోర్టులో పిటిషన్లు కూడా వేసారు.

రుషికొండ తవ్వకాలపై అధికారుల కమిటీ నియమించాలన్న హైకోర్టు..

దీనిపై స్పందించిన హైకోర్టు ఐదుగురు కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో

కమిటీని నియమించాలని ఆదేశించింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో

ఐదుగురు సభ్యులను నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు

ఆదేశాలు ఇచ్చింది. అక్రమ తవ్వకాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలని

చెప్పడమే కాకుండా జనవరి 31 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఈ నివేదిక సంగతి ఏమిటన్నది తెలియరాలేదు.

 

రుషికొండను మింగేస్తున్న వైసీపీ ..పవన్ కళ్యాణ్

రుషికొండ తవ్వకాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఏడాది

నవంబర్ లో పరిశీలించారు. అయితే పవన్ పర్యటన సందర్బంగా

అక్కడ పనులు పూర్తిగా కనపడకుండా అడ్డంగా బారికేడ్లు పెట్టారు.

కొండను మింగేస్తున్న వైసీపీ తీరును గమనించామని పవన్ అన్నారు.

రుషికొండను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి.. రాజేంద్రసింగ్

రుషికొండను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత,

వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అన్నారు.

కొండచుట్టూ తవ్వేసిన తీరు బాధాకరమన్నారు.

మరోవైపు సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ కూడ ఇక్కడ తవ్వకాలను పరిశీలించారు.

వైసీపీ నేతలు ప్రకృతిని రేప్ చేసారు.. సీపీఐ నారాయణ

వైసీపీ నేతలు ప్రకృతిని రేప్ చేశారని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆ పాపం ఎప్పటికైనా వైఎస్సార్సీపీ నాయకులకు తగులుతుందన్నారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రుషికొండను కళ్లారా చూడాలని ప్రధాని మోదీని కోరారు.

రుషికొండను ప్రధాని మోదీ చూడాలి.. అయ్యన్నపాత్రుడు

మోదీ విశాఖ పర్యటనకు వచ్చినపుడు ఏరియల్ సర్వే ద్వారా రుషికొండను చూడాలన్నారు.

ఈ మేరకు అయ్యన్న ప్రధాని మోదీకి లేఖ కూడా రాసారు.

ఈ నేపధ్యంలో హఠాత్తుగా జర్మన్ టెక్నాలజీ తో గ్రీన్ మ్యాట్ కప్పడం దేనికన్నదే

రుషికొండపై గ్రీన్ మ్యాట్ అందుకేనా..

అందరికీ వచ్చిన సందేహం. అయితే దీనిపై ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు.

రుషికొండపై సర్వే చేయడానికి హైకోర్టు ఆదేశాలతో నియమితులైన కమిటీ పర్యటిస్తుందని

అందుకే వారికిపెద్దగా కనిపించకుండా ఈ ఏర్పాటు చేస్తున్నారన్నది ఒక వాదన.

మరికొందరు కమిటీ వచ్చినపుడు దుమ్ము లేవకుండా ఉండటానికే ఇలా చేసారని అంటున్నారు.

మార్చి 28 29లలో జీ 20 సదస్సులు విశాఖలో జరగనుండటంతో ఈ ఏర్పాట్లు చేసారని మరో వాదన.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version