Site icon Prime9

Y. S. Vivekananda Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు.. ఏ1 శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ స్టేట్ మెంట్ రికార్డ్

ys viveka

ys viveka

Y. S. Vivekananda Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ ఒత్తిడి నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఆలస్యమవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది. సీబీఐ ఈ కేసులో ఏ1 శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ స్టేట్ మెంట్ ను జడ్జి రికార్డ్ చేశారు. వివేకా అల్లుడు రాజశేఖర్, శివప్రకాష్ రెడ్డి, బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డిపై తులసమ్మ ఫిర్యాదు చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ… పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్ వేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ఆరుగురుని సీబీఐ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తులసమ్మ ఆక్షేపించింది. వివేకానంద రెడ్డి హత్యకు పలు అంశాలు ప్రభావితం చేశాయని పేర్కొంది. వివేకానంద రెడ్డి హత్యలో ప్రధానంగా ఆర్థిక అంశాలు, కుటుంబ వివాదాలు, వివాహేతర సంబంధాలు ముడిపడి ఉన్నాయని ఆ అంశాలు పరిగణనలోకి తీసుకోలేదని తులసమ్మ పేర్కొంది.

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై తులసమ్మ అనుమానాలు వ్యక్తం చేసింది. వివేకానందరెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివ ప్రకాష్ రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్ లను సీబీఐ విచారించే విధంగా ఆదేశించాలని కోరారు. ఈ హత్యలో వారి ప్రమేయం ఉందని ఆరోపించారు. తులసమ్మ పిటిషన్‌పై 9 నెలల తర్వాత పులివెందుల కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది.

Exit mobile version