Site icon Prime9

JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్.. రూ.22.10కోట్ల ఆస్తులు అటాచ్..

JC Prabhakar Reddy: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ.22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్-3 వాహనాలను, బీఎస్-4 గా మార్చి రిజిస్ట్రేషన్లు చేయించారని ఈడీ ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి కంపెనీ వ్యవహారాలను చూసే సి.గోపాల్ రెడ్డి ఆస్తులను కూడ మనీలాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసింది.

2017 ఏప్రిల్ 1 తర్వాత బీఎస్ 3 వాహనాల అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. అనేక చట్టాలను ఉల్లంఘించి కొన్ని వాహనాలను విక్రయించారనే ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే స్క్రాప్‌ వాహనాల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్‌, చట్టాలను ఉల్లంఘించి విక్రయించడంపై ఈడీ అధికారులు ప్రభాకర్ రెడ్డిని,ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు.

Exit mobile version