Site icon Prime9

Bhatti Vikramarka: ధరణిని బంగాళాఖాతంలో వేశాం.. కొత్త చట్టం తెచ్చామన్న భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka sentational comments Dharani Portal: అసెంబ్లీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందన్నారు.

 

దున్నేవాడిదే భూమి కదా.. ఇదే సాయుధ పోరాట నినాదమని విక్రమార్క అన్నారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని విమర్శలు చేశారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఆ రోజే చెప్పామన్నారు. అందుకే అధికారంలో కి వచ్చిన వెంటనే ధరణిని బంగాళాఖాతంలో వేశామని, దాని స్థానంలో కొత్త చట్టం తెచ్చామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar