Deputy CM Bhatti Vikramarka key Statement Funds from Taxes in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్‌పై కాగ్ నివేదిక అందజేశారు.
ఈ కాగ్ నివేదికలో 2023-24 ఏడాదికి గానూ రూ.2,77,690 కోట్ల బడ్జెట్‌ను అంచనా వేసింది. ఇందులో వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. దీంతో బడ్జెట్ మొత్తం అంచనాలో 75శాతానికి పైగా వ్యయం అయినట్లు వివరించారు.
ఇటీవల ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా 33 శాతం ఖర్చు అయిందని వివరించారు. ఇక, పన్నుల నుంచే రాష్ట్ర ఖజానాకు దాదాపు 61.83 శాతం నిధులు చేకూరినట్లు తెలిపారు. అయితే 2023-24 ఏడాదిలో వడ్డీల చెల్లింపుల కోసం రూ.24,347 కోట్లు ఉండగా.. వేతనాల కోసం రూ.26,981 కోట్లు ఖర్చు చేసినట్లు భట్టి విక్రమార్క వివరించారు.