Site icon Prime9

CM Jagan boating in Parnapalli reservoir : పార్నపల్లి రిజర్వాయర్ లో బోటింగ్ చేసిన సీఎం జగన్

cm jagan

cm jagan

Kadapa district: సీఎం జగన్ కడప జిల్లాలో పార్నపల్లి రిజర్వాయర్‌ బోటింగ్ జెట్టీని ప్రారంభించారు. బోట్టింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం… స్వయంగా అందులో కొద్దిసేపు ప్రయాణం చేశారు. ఇక్కడ లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును కూడా సీఎం ప్రారంభించారు . ఇక్కడ రూ. 6.50 కోట్ల అభివృద్ధి పనులను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.బోటింగ్ లో భాగంగా పాంటున్ బోటు (15 కెపాసిటీ),డీలక్స్ బోట్ (22కెపాసిటీ), 6 సీటర్ స్పీడ్ బోట్ ,4 సీటర్ స్పీడ్ బోట్ లు ఉన్నాయి.

పర్యాటకుల భద్రతా చర్యల్లో బాగంగా స్టేట్ డిసాస్టర్ రిస్క్యూ (ఎస్ డి ఆర్) బోట్, ఫైర్ సర్వీస్ బోట్ లను,లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. అంతకుముందు దిగంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. లేక్ వ్యూ పాయింట్ వద్ద నుంచి ముఖ్యమంత్రి రిజర్వాయర్ అందాలను కూడా తిలకించారు. సీఎం వెంట ఎంపీ అవినాష్‌ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తదితరులు ఉన్నారు.

Exit mobile version