Site icon Prime9

తిరుమల: టీటీడీ ఇంఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌

TTD

TTD

TTD: టీటీడీ ఇంఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ ఇంఛార్జ్ ఈవోగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మంకు బాధ్యతలు ఇచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి 12 రోజుల పాటు సెలవులో ఉన్నారు. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అకాల మరణంతో సెలవుపై వెళ్లారు. 12 రోజుల అనంతరం ధర్మారెడ్డి తిరిగి టీటీడీ ఈవోగా భాధ్యతలను స్వీకరించనున్నారు. అనిల్ కుమార్ సింఘాలు గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన సంగతితెలిసిందే.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి బుధవారం ఉదయం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి ఎంగేజ్‌మెంట్ అయ్యింది. ఈ పనులపైన చెన్నై వెళ్లిన చంద్రమౌళికి ఈ నెల 18న. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉంది.చంద్రమౌళి ఆకస్మిక మృతి పట్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు.

Exit mobile version
Skip to toolbar